logo

భార్యాభర్తల గొడవ మధ్యలో దూరాడు.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు..?


14-Jul-2019 12:27IST
husband and wife in the middle of a fight  lost  his live

 ఢిల్లీలోని సమృద్ధపూర్ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డైన సంజీవ్ పాండే తన సోదరుడితో నివసిస్తున్నాడు. పగలంతా టీ షాపులో, రాత్రి ఓ అపార్ట్‌మెంట్‌ కి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రోజులాగే నిన్న రాత్రి కూడా తన విధి నిర్వహణలో ఉండగా..అదే అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో జితిన్ బోరా ఆయన భార్య దేవీ, వారి పాపతో ఉంటున్నారు. రాత్రి 11 గంటల సమయంలో జితిన్ బోరా తన భార్యతో గొడవ పడ్డాడు. ఎంతకీ కేకలు ఆపకపోవడంతో... వాళ్లకు సర్దిచెబుదామని ఆ ఫ్లాట్‌లోకి వెళ్లాడు 20 ఏళ్ల సంజీవ్ పాండే. అప్పటికే చాలా సేపటినుండి తమ బెడ్ రూమ్ లో గొడవపడుతున్న వారికి సర్ది చెప్పడంతో  కాసేపటికి అంతా కూల్ అయ్యింది. హమ్మయ్య అనుకున్న సంజీవ్... 

 తిరిగి కిందకు వెళ్లి... గేటు దగ్గర కాపలా కాస్తూ అక్కడే కూర్చున్నాడు. కాసేపటి తర్వాత కత్తితో కిందకు వచ్చిన జితిన్ బోరా... ఆ కత్తిని తిన్నగా సంజీవ్ పాండే గుండెలో గుచ్చాడు. అప్పటికే కాస్త నిద్ర మత్తులోకి జారుకున్న సంజీవ్... ఒక్కసారిగా కళ్లు తెరిచి షాకయ్యాడు. రక్తం బొటబొటా కారుతుంటే... ఏం చెయ్యాలో అర్థం కాలేదు అతనికి.... అంతలోనే ఆ కత్తిని గుండె లోంచి వెనక్కి లాగిన జితిన్ బోరా... దాన్ని సంజీవ్ తొడపై గుచ్చి అక్కడి నుండి పారిపోయాడు. గమనించిన స్థానికులు సంజీవ్‌ని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అతను చనిపోయాడు. విషయం తెలిసిన పోలీసులు జితిన్ బోరా సెల్ ఫోన్ సిగ్నల్ ట్రాక్ చెయ్యడంతో తన స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నాడని తెలిసింది దాంతో అతన్ని అరెస్ట్ చేశారు . కానీ ఈ హత్య కోపంలో చేశాడా..? లేక వేరే కక్ష్యలతో చేసి ఉంటాడా..? అని పోలీసులు ఈ కేసుని అనేక  కొనాల్లో దర్యాప్తు చేస్తున్నారు.  

Tags: delhi husband and wife fight lost his live

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top