logo

ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఢీకొన్న బస్సులు..పలువురికి గాయాలు


14-Jul-2019 15:01IST
the buses collided at the delhi airport

ఢిల్లీ: మామూలుగా మనం రోడ్లపై బస్సులు ఢీ కొనడం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదమే ఢిల్లీలో చోటు చేసుకుంది. కానీ ఈ ప్రమాదం రోడ్డు మీద జరగలేదు. ఎయిర్పోర్ట్ లో జరిగింది. వివరాల్లోకెళితే..ఢిల్లీలోని ఎయిర్ పోర్టులో ఓ విమానం ల్యాండ్ అయ్యింది. దీంతో అందులో నుంచి వచ్చిన ప్రయాణికుల్ని... టెర్మినల్ వద్దకు తీసుకెళ్తున్నారు. అయితే రెండు బస్సులు ప్రయాణికుల్ని తీసుకెళ్తున్నాయి. ఆ రెండు బస్సుల డ్రైవర్లు పోటీ పడ్డారు. ఎయిర్ పోర్టులో రేసు పెట్టుకున్నట్లు బస్సుల్ని పరుగులు పెట్టించారు. ప్రయాణికులు వద్దని వారిస్తున్న కొద్దీ... స్పీడ్ మరింత పెంచారు. దీంతో ఒక్కసారిగా రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు గాయాలయ్యాయి. ఇద్దరికి కంటిపైన, ఒకరి తలకి తీవ్రగాయాలు కావడంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రమాద ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా చేసేందుకు ఎయిర్ పోర్టు సిబ్బంది ప్రయత్నించారు. దీంతో ప్రయాణికులు ఒప్పుకోలేదు. ఇద్దరి డ్రైవర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బస్సు నడిపింది డ్రైవర్లు కాదని అనుమానిస్తున్నారు అధికారులు. హెల్పర్స్ బస్సును డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. విమానాలు ల్యాండ్ అయ్యే సున్నిత ప్రదేశమైన ఎయిర్ పోర్టులా బస్సులు ర్యాష్‌గా నడపడం సరికాదంటున్నారు ప్రయాణికులు. బస్సు పొరపాటున ఏదైనా విమానానికి ఢీకొని ఉంటే... ఇంకా పెద్ద ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Tags: buses collided delhi airport

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top