logo

ఓ యువతిపై ఐదుగురు దుండగుల దాడి..


14-Jul-2019 15:25IST
five thugs attack a young woman

దేశంలో రోజు రోజుకు ఆడవారిపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. అలాంటి మరో ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. నిర్భయ ఘటన మొదలు ఇప్పటి వరకు వందలాది రేప్ కేసులు నమోదవుతున్నాయి. వీటి కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా, నివారించానికి ఎన్ని చట్టాలు చేస్తున్నా.. కామాంధుల ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతుంది.  తాజాగా, ఐదుగురు యువకులు ఓ యువతి(17)పై గ్యాంగ్ రేప్ చేశారు. ఓ చోట అఘాయిత్యానికి పాల్పడి, మరో చోటుకు తీసుకెళ్లి అక్కడ కూడా ఆమెపై విరుచుకుపడ్డాడు. తమకు అడ్డు చెబుతోందని కత్తితో ఆమె జట్టు కూడా కత్తిరించి, శారీరకంగా వేధించారు. 

ఈ దారుణ ఘటన ఢిల్లీలోని దక్షిణ ప్రాంతం సాగర్‌పూర్‌లో చోటుచేసుకుంది. గత వారం జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురు కామాంధుల్లో ఇద్దరు ఆ యువతి సోదరుడి స్నేహితులు కావడం గమనార్హం. అయితే, ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. కేసు నమోదు చేసుకోవాల్సింది పోయి.. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. దీనిపై పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇక, అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

Tags: five thugs attack young woman delhi

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top