logo

ఓ దళిత మహిళపై అత్యాచారం...మృగాలుగా మారిన పోలీసులు


15-Jul-2019 12:07IST
the rape of a dalit woman police  turned into rhinoceros

దొంగతనం కేసులో అరెస్టయిన ఓ యువకుడుని పోలీసుల కస్టడీలో చిత్ర హింసలు పెట్టి చంపేశారు. విచారణ పేరుతో అతని వదినని కూడా తమ కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి ఆమె గోళ్లను పీకేశారు.. అలాగే పోలీసులు ఆమెపై ఒకరి తరువాత ఒకరు హత్యచారానికి పాల్పడ్డారు. రాజస్థాన్‌లో సంచలనం రేపిన ఈ ఘటనలో బాధితురాలిని దళిత మహిళగా గుర్తించారు. ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం... కొన్నిరోజుల క్రితం రాజస్థాన్‌లోని చురులో ఓ దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన 22 ఏళ్ల యువకుడిని పొలిసు కస్టడీలోకి తీసుకొని విచారించి ఆ తర్వాత రెండు రోజులకు అతన్ని విడిచిపెట్టారు. 

 జులై 3న, మళ్లీ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈసారి అతని వదిన(35)ను కూడా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. జులై 6వ తేదీ రాత్రి అతను కస్టడీలోనే మృతి చెందాడు. ఆ తర్వాత కూడా అతని వదినను పోలీసులు వదిలిపెట్టకుండా కస్టడీలోనే ఉంచి చిత్రహింసలు పెట్టారు. దారుణంగా ఆమె గోళ్లను పీకారు, లాఠీలతో చితక బాదారు, చివరకు తాము పోలీసులన్నా బాధ్యతను మరిచి ఆమెపై  గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు చురు ఎస్పీ రాజేంద్ర కుమార్ శర్మను విధుల నుంచి తొలగించారు. అలాగే ఆరుగురు కానిస్టేబుల్స్,స్టేషన్ హౌజ్ ఆఫీసర్స్‌ను కూడా తొలగించారు.ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.

Tags: rajasthaan dalit woman raped by police

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top