logo

పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి


15-Jul-2019 12:30IST
revant reddy given clarity about switching party

తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న ఊహాగానాలపై మల్కాజ్ గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తాను బీజేపీలోకి వెళితే ప్రధానిని కాలేనని చమత్కరించారు. కొందరు కావాలనే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు తనను ప్రశ్నించే గొంతుకగా ఉండాలని తీర్పు ఇచ్చానని, తాను అలాగే ఉంటానని అన్నారు. నన్ను నమ్మి ఎంపీగా గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోనని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందే కాలినడకన తిరుమలకు చేరుకున్న రేవంత్ రెడ్డి... వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని శ్రీవారి కోరుకున్నానన్న రేవంత్ రెడ్డి... అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్న పాలకలుగా జ్ఞానోదయం కలిగించాలని స్వామిని వేడుకున్నానని పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

Tags: congress revant reddy clarity switching party

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top