logo

రానున్న24 గంటల్లో కోస్తా, రాయలసీమలో వర్షాలు


16-Jul-2019 13:06IST
rains in costa and rayalaseema over the next 24 hours

విశాఖపట్నం: రానున్న 24 గంట‌ల్లో ఏపీలోని కోస్తా, రాయ‌ల‌సీమ‌లోని ప‌లు చోట్ల వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాత‌వ‌ర‌ణ శాఖ తెలిపింది. కాగా, ఎండ తీవ్ర‌, స‌ముద్రం నుంచి వెలువ‌డే తేమ గాలుల‌తో సోమ‌వారం నుంచి వాతావ‌ర‌ణంలో అనిశ్చితి ఏర్ప‌డింది. ఈ ప్ర‌భావంతో ఈనెల 17 నుంచి రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమలో వర్షాలు ఘ‌న‌నీయంగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు చోట్ల చిరుజ‌ల్లులు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. మ‌త్స్య‌కారులు స‌ముద్రంలో వేట‌కు వెళ్లొద్ద‌ని అధికారులు తెలిపారు.

Tags: rains ap costa rayalaseema next 24 hrs

Advertisement
Advertisement
Top