logo

చెన్నైలో ఘోర ప్రమాదం..


16-Jul-2019 15:42IST
road accident in chennai

చెన్నై: నగరంలోని నందనంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థినిలు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకే బైక్‌ పై వెళుతున్న ముగ్గురిని వెనుక నుంచి వచ్చిన వేరొక బైక్‌ ఢకొీనడంతో.. బస్సు కిందపడి ఇద్దరు అమ్మాయిలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే తీవ్రగాయాలైన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు అమ్మాయిలు చెన్నైలోని ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. మృతులు నాగలక్ష్మి, భవానీలుగా పోలీసులు గుర్తించారు.

Tags: road accident chennai engineering students died

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top