logo

లైంగిక దాడిలో ఒక ఆడ ఏనుగు బలి


16-Jul-2019 16:38IST
female elephant dies after sexual assault by male elephant

చిత్తూర్: స్థానిక జిల్లాలోని పలమనేరు మండలం మండిపేటలోని అటవీ ప్రాంతంలో ఇటీవల ఓ ఆడ ఏనుగు మృతి చెందింది. దాంతో  అందరు అనారోగ్యం కారణంతోనే మరణించి ఉంటుందని భావించారు కానీ పోస్టుమార్టం  అనంతరం అసలు నిజాలు బయటపడ్డాయి.  ఏమోటంటే..?  ఓ మగ ఏనుగు లైoగిక దాడి వల్లే ఆడ ఏనుగు మృతి చెందిందని రిపోర్టులో తేలింది. ఏనుగు చనిపోయిన విషయాన్ని తొలుత అక్కడి పశువుల కాపర్లు గుర్తించారు. అదే సమయంలో అక్కడే ఓ పిల్ల ఏనుగు కూడా కనిపించిందని అధికారులతో చెప్పారు. పశువుల కాపర్లు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి చూడగా ఏనుగు చనిపోయి కనిపించింది. అనారోగ్యంతోనే చనిపోయి ఉంటుందని అధికారులు భావించారు. అనంతరం పోస్టుమార్టమ్ రిపోర్ట్ కోసం ఏనుగు మృతదేహాన్ని తరలించారు.రిపోర్టులో లైంగిక దాడి వల్లే అది మృతి చెందినట్టు తేలింది.

Tags: female elephant sexual assault by male elephant

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top