logo

వీడిన రాంప్రసాద్ మర్డర్ మిస్టరీ...


16-Jul-2019 16:44IST
ram prasad murder mistrey was out

హైదరాబాద్ లో సంచలనం రేపిన వ్యాపారి రాంప్రసాద్ మర్డర్ కేసు మిస్టరీ వీడింది. డబ్బుల కోసమే మర్డర్ జరిగిందని పోలీసులు నిర్దారించారు. రాంప్రసాద్ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా కోగంటి సత్యంను పోలీసులు గుర్తించారు. ఈ కేసు వివరాలను జాయింట్ సీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. కోగంటి సత్యం, శ్యామ్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. రాంప్రసాద్ హత్య కేసులో 11మంది నిందితులు ఉన్నారని వారిలో ఐదుగురిని అరెస్ట్ చేయగా ఆరుగురు పరారీలో ఉన్నారని వెల్లడించారు. చాలా ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న మృతుడు రాంప్రసాద్, కోగంటి సత్యం మద్య లావాదేవీల్లో వచ్చిన విబేధాలే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. హత్యకు నెల రోజుల ముందే రెక్కీ నిర్వహించారని డీసీపీ తెలిపారు. ఈ మర్డర్ కేసులో ఏ1గా కోగంటి సత్యనారాయణ పేరుని చేర్చామన్నారు. హత్యకు సంబంధించి రాజకీయ కోణం బయటపడలేదని వెల్లడించారు.

Tags: ram prasad murder mistrey

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top