logo

రోడ్డు పక్క హోటల్‌కు సాదాసీదా వ్యక్తిలా ఎంట్రీ ఇచ్చిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే


16-Jul-2019 17:04IST
asifabad MLA made entry to a roadside hotel

ఈరోజుల్లో ఎమ్మెల్యే అంటే.. చుట్టూ మంది మార్బలం.. ఆర్భాటం అత్యంత కామన్. ఎమ్మెల్యే బయట అడుగుపెట్టాడంటే అనుచరుల హడావుడి మామూలుగా ఉండదు. అలాంటిది ఓ ఎమ్మెల్యే మాత్రం అత్యంత సాదాసీదాగా సామాన్యుడి తరహాలో ఓ హోటల్లో ప్రత్యక్షమయ్యాడు. ఆయనే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు.. ఏదో పని నిమిత్తం మంచిర్యాల మీదుగా వెళ్తుండగా.. అప్పటికే భోజన సమయం కావడంతో బెల్లంపల్లి చౌరస్తాలో కారును నిలిపి. అక్కడి సమీపంలోని ఓ హోటల్లోకి వెళ్లి సాధారణ వ్యక్తిలా గన్‌మెన్‌లతో కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే హోటల్లో కనిపించడంతో ఆయన్ను గుర్తుపట్టినవారు ఆశ్చర్యపోయారు. తెలియనివారు ఆయన ఎమ్మెల్యే అని తెలుసుకుని అవాక్కయ్యారు

Tags: asifabad MLA made entry roadside hotel

Advertisement
Advertisement
Top