logo

ఓ వివాహితపై ఏడాదిగా లైంగిక దాడులు..


17-Jul-2019 10:42IST
one year of sexual assault on a married woman

అనంతపురం: పట్టణంలోని రాయదుర్గంలో ఓ ఘాతుకం చోటుచేసుకుంది.  ఓ వివాహితను బెదిరించి ఆమెను  ఏడాది నుండి లైంగికంగా వేధించారు. ఇక వారి ఆగడాలకు హద్దు పద్దు లేకపోవడంతో భరించలేని ఆ మహిళా తన భర్త సహాయంతో పోలీసులను ఆశ్రయించింది.  సీఐ రియాజ్‌ అహ్మద్‌ తెలిపిన వివరాల ప్రకారం...అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓ వీధిలో దంపతులు చేతి వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సదరు మహిళా రోజు పాల కోసమని వీధి చివరిలోని పాల వ్యాపారిదగ్గరకు రోజు వెళ్ళేది. దాంతో వారిరువురి మధ్య పరిచయం ఏర్పడింది. ఫేసుబుక్ ద్వారా ఆమె వ్యక్తిగత  సమాచారాన్ని సేకరించి ఆమెతో మరింత చనువుగా వ్యవహరించేవాడు.  

ఫోనులో వారి మధ్య జరిగిన సంభాషణను రికార్డు చేసి తన భర్తతో చెప్తానని భేదిరించి తనని లొంగదీసుకున్నాడు. అంతే కాకుండా అదే వీధిలోని మరో ముగ్గురు యువకులను ఆమెకు పరిచయం చేసాడు. వారు కూడా అదే రీతిలో భర్తకు చెబుతామని బెదిరించి ఒక్కొక్కరుగా లొంగదీసుకున్నారు. ఈ తతంగం దాదాపు ఏడాది కాలంగా భరిస్తూ వచ్చిన మహిళపై వేధింపులు మరింత పెరిగాయి. చివరకు తమ మాట వినకపోతే నీ భర్తను చంపేస్తామని.. నీపై యాసిడ్‌ పోస్తామని బెదిరించారు. గత్యంతరం లేక ఆమె భర్తకు విషయం తెలిపి అతని సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు బాధితురాలి పిర్యాదు మేరకు   రెడ్‌విత్‌ 34, 376, 370, 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందుతులల్లో ఇద్దరినీ అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలిపారు..

Tags: ananthapuram one year sexual assault married woman

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top