logo

ముంబైలో కూలిన వందేళ్లనాటి భవనం


17-Jul-2019 11:07IST
12 died in mumbai building collapse

మంగళవారం ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో కేస‌ర్ భాయ్‌ బిల్డింగ్ కూలిన ఘ‌ట‌న తెలిసిందే. అయితే ఆ భ‌వనం వందేళ్ల క్రింద‌టిద‌ని ఆ రాష్ట్ర సీఎం ఫ‌డ్న‌వీస్ తెలిపారు. ఆ బిల్డింగ్‌ను పున‌ః నిర్మిస్తే బాగుండేద‌ని సీఎం అన్నారు. బిల్డింగ్ శిథిలాల్లో సుమారు 50 మంది చిక్కుకున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రి మృత‌దేహాల‌ను వెలికితీశారు. బిల్డింగ్ కూలిన ఘ‌ట‌న‌ను లెవ‌ల్ 2గా చిత్రీక‌రించారు. శిథిలాల నుంచి ఓ చిన్నారిని ర‌క్షించి హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పౌరులు స‌హ‌క‌రించాల‌ని ముంబై మున్సిపాల‌టీ ఓ ట్వీట్‌లో కోరింది. శిథిలావ‌స్థ‌లో ఉన్న బిల్డింగ్ జాబితాల్లో ఇది లేద‌ని అధికారులు చెబుతున్నారు. బిల్డింగ్ శిథిలాల్లో 15 కుటుంబాలు చిక్కుకున్న‌ట్లు సీఎం ఫ‌డ్నవీస్ చెప్పారు. ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు సీఎం తెలిపారు.

Tags: 12 died building collapse mumbai

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top