logo

భారీ స్థాయిలో గంజాయి పట్టివేత


17-Jul-2019 12:43IST
large amount of cannabis seized by police

ప్రకాశం: పట్టణంలోని మార్టూరు శివారు బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు ఈ గంజాయిని రెండు ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారంతో రాత్రి నుంచి నిఘా పెట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తెలిపారు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఈ ఘటనలో గంజాయి తరలిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉండటం విశేషం. నిందితుల వద్ద నుంచి 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు ఆర్టీసీ బస్సులను కూడా అదుపులోకి తీసుకొని సమీప స్టేషన్ కి తరలించారు. అలాగే విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్న మరికొందరి కోసం తనిఖీలు చేపట్టారు.

Tags: 80kg cannabis seized prakasham distict

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top