logo

రోడ్లు బాగుండాలంటే టోల్ ఫీజు చెల్లించాల్సిందే


17-Jul-2019 17:49IST
Toll fees have to be paid for the good roads

ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేని కారణంగానే టోల్‌ వ్యవస్ధ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రజలు మంచి సేవలను కోరుకుంటున్నట్లయితే టోల్‌ఫీజు కట్టాల్సిందేనని మంగళవారం లోక్‌సభలో రోడ్డు రవాణా, రహ దారుల మంత్రిత్వ శాఖకు గ్రాంట్ల డిమాండ్‌పై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చింది. గడిచిన ఐదేళ్ళలో ప్రభుత్వం 40 వేల కిలోమీటర్ల జాతీయ రహదార్లను నిర్మించిందని ప్రభుత్వం తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో టోల్‌ వసూలు పై కొంత మంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంపై జవాబుగా  చెల్లించగల సామర్థ్య మున్న ఆయా ప్రాంతాలలో వసూలు చేస్తున్న టోల్‌ ఫీజును గ్రామీణ, పర్వత ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. టోల్‌ వ్యవస్ధ కొనసాగుతుందని, కాలానుగుణంగా టోల్‌ ఫీజులు మారతాయని కేంద్రం స్పష్టం చేసింది.
 

Tags: Toll fees good roads

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top