logo

నడి రోడ్డుపై ఆమెకు చేదు అనుభవం..?


17-Jul-2019 18:04IST
her bitter experience on the road

ఓ యువతీ తన ఆఫీస్ విధులను ముగించుకొని హాస్టల్ కి బయలుదేరింది.  రోడ్డుపై నడుస్తుండగా ఒక పెద్దాయన ఆమె దగ్గరికి వచ్చి ఆమెను నడి రోడ్డుపై ఆపాడు..? దాంతో షాక్కు గురైన ఆమె ఏం కావాలని అడగగా..? ఆ పెద్దాయన నీ ఫోన్‌లో ఇంటర్నెట్ ఉందా? అని అడిగాడు  దానికి  ఆమె ఉందని బదులివ్వడంతో ఆయన ముంబైలో ఓ భవంతి కూలిపోయి చాలామంది చనిపోయారు కదా.. ఒకసారి గూగుల్‌లో ఆ న్యూస్ చూపించవా అని అడిగాడు. పాపం.. అందులో ఆ పెద్దాయనకు సంబంధించనవారు ఎవరైనా ఉన్నారేమో అనుకుంది. గూగుల్‌లో సెర్చ్ చేసి ఆ న్యూస్‌ను చూపించింది. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది.. ఆ తర్వాతే ఆ పెద్దాయన అసలు స్వరూపం బయటపడింది.. ! కాసేపటికి.. ఆ న్యూస్ క్లోజ్ చేసి తిరిగి గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కి వెళ్లమని అడిగాడు. ఎందుకలా అడుగుతున్నాడో అర్థం కాలేదు..

 కానీ అతను చెప్పినట్టే చేసింది. అప్పుడు అడిగాడు.. ఇందులో 'హెచ్‌డి ఫోన్' వస్తాయా? అని.. అతని ప్రశ్న ఆమెకేమీ అర్థం కాలేదు. దీంతో ఆమె చేతిలో నుంచి ఫోన్ తీసుకుని 'hdporn' అని టైప్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఆమెకు నిజంగా షాక్ తిన్నంత పనైంది. ముంబైకి చెందిన ఓ మహిళకు మంగళవారం ఈ అనుభవం ఎదురైంది. తనకు ఎదురైన ఈ చేదు అనుభవం గురించి ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. ఆ పెద్దమనిషి అలా చేయడంతో.. ఫోన్ లాక్కుని తిరిగి వెనక్కి చూడకుండా వెళ్లిపోయినట్టు తెలిపింది. అతని వయసు దాదాపు 55-60 ఉంటుందని తెలిపింది. పెద్ద మనిషి అయి ఉండి.. ఓ అమ్మాయిని రోడ్డుపై ఆపి మరీ ఇలా చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ట్విట్టర్‌లో దీనిపై ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పటికే వైరల్‌గా మారింది.

Tags: bad experience on the road hdporn videos

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top