logo

ఒక్క‌రోజులో 6 వేల బుకింగ్‌లు


18-Jul-2019 12:35IST
6000 bookings in a single day

న్యూఢిల్లీ: కియా మోటర్స్‌కు అనూహ్య స్పందన ల‌భించింది. తన తొలి ఎస్‌యూవీ సెల్టాస్ కోసం ముందస్తు బుకింగ్‌లను ఆరంభించిన తొలిరోజే ఏకంగా 6 వేలు వచ్చాయని కంపెనీ తెలిపింది. ఆగస్టు 22న దేశీయ రోడ్లపై దూసుకుపోనున్న ఈ కారు కోసం 6,046 బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. వీటిలో 1,628 కార్లు ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోగా, మిగతా దేశవ్యాప్తంగా 160 నగరాల్లో ఏర్పాటు చేయబోతున్న డీలర్ల ద్వారా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో ప్రతియేటా 3 లక్షల కార్లు ఉత్పత్తి కానున్నాయి.

Tags: six thasound bookings one day kia motors

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top