logo

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై ఓ తెరాస మహిళ నేత దాడి..!!


19-Jul-2019 10:25IST
traffic constable attacked by woman leader

హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తన కెమెరాతో ద్విచక్రవాహనంపై ముగ్గురు వెళ్తుండగా వీడియో తీసినందుకు ఓ తెరాస మహిళ నేత  తన కుటుంబ సభ్యులతో కలిసి దాడిచేసిన సంఘటన హైదరాబాద్‌లోని  మౌలాలి కమాన్‌వద్ద చోటుచేసుకుంది. సీఐ మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం...జియాగూడకు చెందిన మహమ్మద్‌ గౌస్‌ అనే వ్యక్తి  మరో ఇద్దరితో కలిసి తన  ద్విచక్రవాహనంపై మౌలాలి కమాన్‌ వైపుగా వస్తున్నాడు. దాంతో అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ముజఫర్‌ వారిని తన కెమెరాతో వీడియో తీసాడు...అది గమనించిన గౌస్ వెంటనే తన వాహనాన్ని ఆపి కానిస్టేబుల్‌ను బెదిరించి వెళ్లాడు. వెళ్లిన కాసేపటికే...గౌస్ మౌలాలి షాదుల్లానగర్‌కు చెందిన తెరాస నాయకురాలు, వార్డు సభ్యురాలైన సయ్యద్‌ మహ్మద్‌ బేగం, ఆమె భర్త సయ్యద్‌ గఫార్‌, వారి కొడుకు సయ్యద్‌ సిద్ధిఖ్‌ హుస్సేన్‌, బంధువు మహమ్మద్‌ మజీద్‌లను వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు. వచ్చిరావడంతోనే వీడియో తీయటంపై మహ్మద్‌ బేగం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కమాన్‌వద్ద అందరూ చూస్తుండగా తన ఎడమ కాలిచెప్పుతో కానిస్టేబుల్‌ను మహ్మద్‌ బేగం కొట్టింది. ఆమెతో పాటు బంధువులు కూడా కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. అతని వద్ద నుంచి వీడియో కెమెరాను బలవంతంగా లాక్కున్నారు. అనంతరం కానిస్టేబుల్‌ను హెచ్చరించి, తిరిగి ఆ కెమెరాను అక్కడే వదిలేసి వెళ్లారు...దాంతో బాధితుడు జరిగిన ఘటనపై పోలీసులకు పిర్యాదు చెయ్యగా...దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసారు.

Read latest CrimeNews and Telugu News | Follow us on FaceBookTwitter

Tags: traffic constable attacked trs woman leader

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top