logo

రేషన్ కార్డుల‌కు టైం ప‌డుతుంది..


19-Jul-2019 11:49IST
time for ration cards

హైదరాబాద్ : కొత్త రేషన్ కార్డుల‌కు ఇంకాస్త స‌మ‌యం ప‌డుతుంద‌ని నగర పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు దరఖాస్తులు తీసుకున్నప్పటికీ కొద్ది రోజులుగా దరఖాస్తులు తీసుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే రేషన్‌కార్డు విధానం తెస్తామని ప్రకటించడంతో కొత్త కార్డులు జారీచేస్తే మళ్లీ ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశ్యంతో కొత్త కార్డుల జారీ నిలిపివేసినట్లు తెలిపారు. ఐతే అధికారికంగా ఆదేశాలు అందనప్పటికీ కమిషనర్‌ కార్యాలయం నుండి మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు హైదరాబాద్‌ సీఆర్వో కార్యాలయంలోని ఓ కీలక అధికారి తెలిపారు. దరఖాస్తు చేసుకున్నవారిలో లబ్ధిదారులుగా చాలా మందిని గుర్తించారు. దరఖాస్తు చేసుకున్నవారిలో ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ఉన్నతశ్రేణికి చెందిన వ్యక్తులను గుర్తించి కేవలం పేద వర్గాలనే లబ్ధిదారులుగా గుర్తించారు. లబ్ధిదారుల జాబితా సిద్ధంగా ఉన్నప్పటికీ మళ్లీ ఆదేశాలు రాగానే కొత్త కార్డులు జారీచేస్తామని తెలిపారు. 

Tags: new ration cards officers hyderabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top