logo

రైలు ప‌ట్టాల‌పైనే పాస్ పోసేశాడు..


19-Jul-2019 14:30IST
motorman caught stopping on the train tracks

ముంబై: ఓ రైలు డ్రైవర్ రైలును మధ్యలోనే ఆపి పట్టాలపైనే మూత్రం పోశాడు. ముంబయికి చెందిన సోను షిండే అనే వ్యక్తి ఫుట్‌ ఓవర్ బ్రిడ్జి మీద నుంచి నడుచుకుని వెళ్తుండగా లోకో పైలట్ రైలు ఆపి కిందికి దిగడాన్ని చూశాడు. రైలు ఎదురుగా పట్టాలపైనే అతడు మూత్రం పోయడం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే తన కెమేరా తీసి వీడియో తీశాడు. ఆ వీడియో ట్విట్టర్‌లో ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారి రైల్వే ఉన్నతాధికారులకు చేరింది. ఈ ఘటనపై సీనియర్ సెంట్రల్ రైల్వే ఆఫీసర్ స్పందిస్తూ.. ‘‘ఈ వీడియో మాకు అందింది. ఈ ఘటనపై ఇంకా విచారణ జరుగుతోంది’’ అని తెలిపారు. ఈ వీడియో పై స్పందించిన ఓ నెటిజన్.. లోకల్ రైళ్లు నడిపే లోకో పైలట్లకు విశ్రాంతి దొరకడం చాలా కష్టం. సుమారు 3 నుంచి 5 గంటలు ఆగకుండా రైలును నడుపుతూనే ఉండాలి. ఈ నేపథ్యంలో వారికి మూత్రం పోసుకోడానికి కూడా సమయం చిక్కదు. దీంతో ఆ లోకో‌పైలట్ అలా చేయడంలో తప్పులేదని అన్నాడు. అయితే, అతను ట్రాక్ మీద కాకుండా పక్కకి వెళ్లి ఆ పనిచేసి ఉంటే బాగుండేదని మరికొందరు అంటున్నారు.

Is he driving car🚗or Train🚂?🤔

Viral Video - Motorman caught stopping train btwn Ulhas nagar & Vithalwadi to take a leak, video goes viral 😄

He was wasted thousands of commuters time,@rajtoday @KMMIRROR @MukeshMakhija_v @damuNBT @mumbairailusers @RailMumbai

Tags: motorman caught stopping train

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top