logo

కూతురిని కడతేర్చేందుకు ప్రయత్నించిన కన్న తల్లి..!


19-Jul-2019 14:34IST
mother trying to kill  her daughter

కన్నతల్లే తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కూతురిని కడతేర్చేందుకు ప్రయత్నించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో చోటుచేసుకుంది.  తెలిసిన వివరాల ప్రకారం...స్థానిక పట్టణంలోని ఓ యువతీ తన తల్లితో ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతంలోని ఓ ప్రభుత్వ  కళాశాలలో డిగ్రీ చదువుతుంది. వారింటికి సమీపంలోనే ఓ యువకుడు రోజు ఆ యువతీ ఇంటికి వచ్చి వెళ్తుంది వాడు. దాంతో వారి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ ఇంట్లో పెద్దలకు తెలియకుండానే తమ ప్రేమాయణాన్ని కొనసాగించారు. అయితే వ్యవహారాన్ని గమనించిన తల్లి తనని మందలించకుండా ఆ యువకుడిపై కన్నేసింది అంతేకాదు అతనితో  శారీరక సంబంధం పెట్టుకునేందుకు సైతం ఆమె వెనుకాడలేదు. 

ఈ క్రమంలోనే వారిరువురి మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. ఈ విషయం కూతురికి తెలియడంతో తాను ఇష్టపడిన వ్యక్తితో అలాంటి సంబంధం ఎలా పెట్టుకున్నావని నిలదీసింది. కామంతో కళ్లుమూసుకుపోయిన తల్లికి కన్నకూతురిని సైతం ఖాతరు చేయలేదు. ఎలాగైనా అతన్ని దక్కించుకోవాలని అందుకు అడ్డంగా ఉన్న కూతురిని కడతేర్చేందుకు ప్రయత్నించింది. పథకం ప్రకారం ఇంట్లో సిలిండర్ పేల్చి కూతురిని చంపేయాలనుకుంది. అనుకున్నట్టుగానే వంటగదిలో గ్యాస్ లీక్ చేసి మంటపెట్టి నెమ్మదిగా తల్లి ఇంట్లోనుంచి జారుకుంది. అనంతరం సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం అయినప్పటికీ అదృష్టవశాత్తూ తన కూతురు గాయాలతో బయటపడింది. తల్లి చేసిన పనితో భయపడి  పోలీసులకు ఫిర్యాదుచేయగా, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

Tags: utharpradesh mother attempt to murder daughter

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top