logo

భార్యపై అనుమానంతో 9 మంది బ‌లి..


19-Jul-2019 14:41IST
nine killed on suspicion of wife

కోల్‌క‌తా: భార్య‌పై అనుమానం పెంచుకున్న ఓ వ్య‌క్తి చేసిన ప‌నికి 9 మంది బ‌ల‌య్యారు. వీరిలో ముగ్గురు చ‌నిపోగా, మ‌రో ఆరుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వివరాల్లోకి వెళ్తే.. కోల్ కత్తాలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే వ్యక్తి (46) కుటుంబంతో కలిసి దక్షిణ 24 పరగణాల జిల్లాలో నివాసముంటున్నాడు. అతని బంధువులు కూడా అక్కడే ఉంటున్నారు. అయితే, గత కొంతకాలంగా తన భార్య దగ్గరి బంధువైన ఓ వ్యక్తితో సంబంధ పెట్టుకుందని అతనికి అనుమానం మొదలైంది. 15 రోజుల క్రితం వారిద్దరూ కలిసి బయటకు వెళ్లడంతో ఈ అనుమానం మరింత బలపడింది. దీంతో భార్యతో చనువుగా ఉంటున్న వ్యక్తిని హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. ఈక్రమంలో బుధవారం రాత్రి సదరు వ్యక్తి ఇంటి గుమ్మం బయట విద్యుత్‌ సరఫరా ఉన్న వైర్‌ను ఉంచాడు. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తిని వెలుపలకు రప్పించేందుకు బయట ఉన్న వారి బట్టలకు నిప్పుపెట్టాడు. మంటల్ని ఆర్పేందుకు ఇంట్లోని వారు ఒకరివెంట ఒకరు బయటికొచ్చారు. గుమ్మంలో ఉన్న విద్యుత్‌ వైర్‌ తగిలి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడువగా.. మరో ఆరుగురు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పారిపోయేందుకు యత్నించిన నిందితున్ని రైల్వే స్టేషన్‌లో పట్టుకున్న గ్రామస్తులు చితకబాది పోలీసులకు అప్పగించారు.

Tags: crime wife husband kolkata

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top