logo

పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన సెల్ ఫోన్


19-Jul-2019 15:07IST
a cell phone spilled in a green enclosure

భార్య దొంగచాటుగా ఫోన్ మాట్లాడిందని అనుమానం పెంచుకున్న భర్త.. కొడవలితో ఆమెపై దాడికి సిద్ధపడిన ఘటన అనంతపురం జిల్లా సంఘటివారిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం బాధితురాలు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే.. సంఘటివారిపల్లిలో స్వాతి-రమణయ్య అనే దంపతులు చాలా కాలం నుండి అన్యోన్యగా జీవిస్తుందే వారు. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో సెల్‌ఫోన్ చిచ్చు పెట్టింది. కొన్ని రోజుల క్రితం స్వాతి...

ఆమెకు వరుసకు సోదరుడైన వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడింది.అయితే ఆమె పక్కకు వెళ్లి మాట్లాడటం రమణయ్యలో అనుమానం కలిగించింది. రమణయ్య ఆమెను నిలదీయగా.. అసలు తానెవరితో ఫోన్ మాట్లాడలేదని చెప్పింది. దీంతో ఆమెపై మరింత అనుమానం పెంచుకున్న రమణయ్య.. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొడవలితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు.  దీంతో ఆమెకు కుడిచేతికి తీవ్ర గాయమైంది. స్వాతి గట్టిగా కేకలు పెట్టడంతో రమణయ్య అక్కడినుంచి పారిపోయాడు. దాంతో తీవ్ర రక్తా స్రావం కావడంతో స్థానికులుఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు కాలేదని సమాచారం.
 

Tags: phone call husband attempt murder sickle

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top