logo

'ఆర్ఆర్ఆర్'లో ఛాన్స్ ఇస్తానంటూ మహిళను మోసం చేసిన వ్యక్తి


20-Jul-2019 07:48IST
man defrauded a woman by giving Chance in RRR movie

టాలీవుడ్ భారీ చిత్రం 'ఆర్ఆర్ఆర్' సినిమాలో అవకాశం ఇప్పిస్తానని ఒక మహిళను మోసం చేసి 50 లక్షల నగదును కాజేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. వివరాలలోకి వెళితే బంజారాహిల్స్‌లోని ఓ కలర్‌ ల్యాబ్‌లో పనిచేస్తున్న వీరబత్తిని నరేష్‌ అనే వ్యక్తి జస్ట్ డయల్ యాప్ లో ఒక మహిళా న్యాయవాది అడ్రస్ తీసుకొని ఆమెను బుట్టలోకి దించాడు. 

తన పేరు ఆదిత్య అని, తానూ ఆర్ఆర్ఆర్ సినిమాకు సహా నిర్మాతను అని చెప్పి పరిచయం చేసుకొన్నా నరేష్ ఆమెకు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఆశ చూపాడు. స్క్రీన్‌ టెస్ట్‌, ధరావతులు అంటూ ఆమె దగ్గర నుండి 50 లక్షల నగదును తీసుకొన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా అనగానే ఆమె కూడా మరో మాట మాట్లాడకుండా నరేష్ అడిగినంత డబ్బును ఇచ్చింది . 

కాగా కొన్ని నెలల తర్వాత నుండి సినిమా షూటింగ్ కి తీసుకెళ్లామని ఆమె అడగడంతో నరేష్ పరారయ్యాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ చెయ్యడంతో అనుమానించిన మహిళా బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకొన్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. అతనితో పాటు అతనికి సాయం చేసిన మరో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటనపై పోలీసులు చీటింగ్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read latest Movies News and Telugu News Follow us on FaceBookTwitter 

Tags: man defrauded RRR rajamouli ram charan ntr

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top