logo

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి


20-Jul-2019 08:59IST
chief whip srikanth reddy sensational comments on chandrababu

చంద్రబాబు దుర్మాగాలు వల్లే ప్రపంచ బ్యాంకు రుణాన్ని తిరస్కరించిందని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి చంద్రబాబు అప్పు అడిగారని, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకుకు నివేదికలు పంపింది రాజధాని రైతులే అని ఆయన అన్నారు. ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ను బాబు దుర్వినియోగం చేశారని రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు.

కౌలు రైతులను చంద్రబాబు భయాందోళనకు గురి చేస్తున్నారని, దళితుల భూములను కాజేస్తున్నారని, 'భూ రికార్డ్'లను టీడీపీ నేతలు తారుమారూ చేస్తున్నారని రైతులు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసారని అన్నారు. చంద్రబాబు చేసిన దుర్మాగాలను రాజధాని రైతులు ప్రపంచ బ్యాంకు దృష్టికి తీసుకెళ్లారని, ప్రపంచ బ్యాంకు రుణాన్ని తిరస్కరించినందుకు వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ఫిర్యాదు మేరకు రుణం రాలేదని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBookTwitter 

Tags: chief whip srikanth reddy sensational comments chandrababu tdp ysrcp

Advertisement
Advertisement
Top