logo

గర్భం దాల్చిన 8వ తరగతి విద్యార్థిని


20-Jul-2019 10:58IST
8th grade student is pregnant

ఒడిస్సా: ఒడిశాలోని కొంధమాల్‌ జిల్లా బెల్‌ఘర్‌ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో  చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన వెలుగుచూసింది. బెల్‌ఘర్‌ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి శ్రీకాంత్‌ ఖొమారి తెలిపిన వివరాల ప్రకారం...బెల్‌ఘర్‌ సమీప ప్రాంతంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైంది. దాంతో పాఠశాల విద్యాలయ నిర్వాహకులు బాలికకు ఆరోగ్య పరీక్షలు జరిపించగా, నాలుగు నెలల గర్భిణిగా తేలింది. దాంతో  ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సమీప ప్రాంతంలోని బెల్‌ఘర్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు నిందుతుడు అమూల్య ప్రధాన్‌(23)గా గుర్తించి అరెస్ట్ చేసి న్యాయస్థానానికి తరలించారు.

Tags: 8th grade student pregnant odissa

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top