logo

నాగుపాముతో సెల్ఫీ దిగితే ఇక జైలుకే...!


20-Jul-2019 13:05IST
playing with a cobra police has arrest him

నేటి యువతకు సెల్ఫీ పిచ్చి పీక్స్ స్టేజికి వెళ్ళింది. టిక్ టాక్ విడియోల పిచ్చితో ఈ మధ్య యువత ప్రాణాలుపైకి తెచ్చుకుంటున్నారు. చాలా మంది యువత సోషల్ మీడియాలో  క్రేజ్ కోసం సెల్ఫీ మోజులో ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. అయినా మన యువతలో ఎలాంటి మార్పు రాకపోవడమే కాకుండా ఇంకా ఆ పిచ్చి ముదిరిపోతూ వస్తూనే ఉంది. దానికి నిదర్శనం ఈ సంఘటనే ఒడిశాలో కొందరు యూత్ బుసలు కొడుతున్న నాగుపాముతో సెల్ఫీలు దిగారు. అందులో రోహిత్ అనే యువకుడు నాగుపాముతో ఆటలాడాడు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి వైరల్ అయి వన్యప్రాణి సంరక్షణ అధికారుల దృష్టికి చేరాయి. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రోహిత్‌ను అరెస్ట్ చేశారు.ప్రాణాలు పోగట్టే ఇలాంటి సెల్ఫీలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags: playing with a cobra police arrested odissa

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top