logo

బైక్‌పై ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ.. హెల్మెట్‌ లేకుండా ఆర్జీవీ


20-Jul-2019 16:01IST
ramgopal varma triple riding without helmet

టాలీవుడ్‌  డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌.. రామ్‌ గోపాల్‌వర్మ శిష్యుడన్న సంగతి తెలిసిందే. చాల కాలానికి తన శిష్యుడు పూరి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో హిట్‌ కొట్టాడు. ఈ చిత్రాన్ని చూసేందుకు వర్మ రూల్స్‌ను బ్రేక్‌ చేస్తూ తన శిష్యులతో కలిసి బైక్‌తో వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఆర్‌ఎక్స్‌ 100 దర్శకుడు అజయ్‌ భూపతి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ డైరెక్టర్‌ అగస్త్య మంజు, తాను బైక్‌పై ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ.. హెల్మెట్‌ లేకుండా సినిమాను చూడటానికి వెళ్తున్నానని ట్వీట్‌ చేస్తూ.. ఫోటోను షేర్‌ చేశాడు ఆర్జీవీ . ఇక ఫోటోను నెటిజన్లు కామెంట్లతో ఓ ఆట ఆడేసుకున్నారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు వర్మ చాలెంజ్‌ విసిరాడని, మూడు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించారని.. నో హెల్మెట్‌, త్రిబుల్‌ రైడిండ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తూ.. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు ట్యాగ్‌ చేస్తున్నారు. 

Tags: Ram gopal Varma triple rider bike iSmart Shankar

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top