logo

'జబర్దస్త్' వినోద్ పై హత్యయత్నం


20-Jul-2019 19:01IST
jabardasth comedian vinod injured in house owner attack

తెలుగు బుల్లితెర హిట్ షో 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా లేడీ గెటప్ లో పాపులర్ అయిన నటుడు వినోద్ ఫై దాడి జరిగింది. తాను నివాసముంటున్న ఇంటి ఓనర్ తనపై దాడి చేశాడంటూ కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్బిగూడలో వినోద్ నివాసముంటున్నాడు. 

అయితే గత అర్ధరాత్రి సమయంలో ఇంటి ఓనర్ తనపై దాడికి పాల్పడ్డాడని వినోద్ తెలుపుతున్నారు. ఈ దాడిలో వినోద్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. తలకు, కంటికి పెద్ద గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం అతనిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అసలు వీరిద్దరి మధ్య జరిగిన వివాదం ఏంటి ? ఎందుకు ఓనర్ వినోద్ ఫై దాడికి పాల్పడ్డాడు లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.   

Tags: jabardasth vinod house owner attack

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top