logo

సెల్ ఫోన్ పిచ్చితో ఓ యువకుడి ఆత్మాహత్యా


21-Jul-2019 14:22IST
The suicide of a young man with cell phone insanity

తల్లిదండ్రులు తనకి సెల్ ఫోన్  కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లాలో కలకలం రేపింది. నర్మెట్ట మండలం హన్మంతపూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల పోతాని ప్రశాంత్ తన తోటి వారి వద్ద స్మార్ట్ ఫోన్ చూసి తనకి అల్లాంటి ఫోన్ కావాలని కొద్దీ రోజులుగా తన తండ్రిని అడుగుతూ వచ్చాడు..అందుకు తండ్రి సత్తయ్య నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. గమనించిన తండ్రి సమీప ప్రాంతంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రశాంత్ తన చివరి శ్వాస వదిలాడు. దాంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: cell phone insanity suicide young man

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top