logo

ఏపీలో ఓ యువతిపై దారుణం...


21-Jul-2019 14:58IST
a young woman gang raped

ప్రియుడిని నిర్బంధించి ముగ్గురు యువకులు... ప్రియారాలిపై అత్యాచారం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో కారంచేడులో చోటుచేసుకుంది. వివారాల్లోకెళితే...చీరాల పట్టణం విఠల్‌ నగర్‌ కు చెందిన ఓ యువతి (25)కి మూడేళ్ల క్రితం వివాహం కాగా, భర్తతో విభేదాలతో విడాకులు తీసుకుని తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. తన అవసరాల నిమిత్తం ఆమె ఓ దుకాణంలో పని చేస్తుండగా, ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 

వీరిద్దరూ రాత్రి ఏడు గంటల సమయంలో కారంచేడు సమీపంలోని వంతెన వద్దకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మరో ముగ్గురు యువకులు వారిని బెదిరరించి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్, డబ్బులు దోచుకున్నారు. అంతే కాకుండా వారిద్దరిని నిర్బంధించి యువకునిపై దాడిచేసి యువతిని లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసును నమోదు చేసిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా  ఏర్పడి  నిందితుల కోసం గాగాలిస్తున్నారు 

Tags: a young woman gang raped prakasham district ap

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top