logo

నేడు స్వగ్రామానికి సీఎం కేసీఆర్...


22-Jul-2019 08:48IST
cm kcr will visit his native village chintamadaka

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు నేడు తన స్వగ్రామం చింతమడకలో పర్యటించనున్నారు. తమ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తమ గ్రామానికి విచ్చేస్తుండటంతో చింతమడకలో పండగ వాతావరణం నెలకొంది. ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా ఉదయం 11 గంటలకు చింతమడకకు కేసీఆర్‌ చేరుకుంటారు.

గ్రామ ప్రజలు, తనచిన్ననాటి స్నేహితులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నారు. గ్రామంలో కాలినడకన పర్యటిస్తూ పలు ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం వనభోజనాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు, కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, సీపీ జోయల్‌ డేవీస్‌ వారం రోజులుగా ఏర్పాట్లను పూర్తిచేయించారు. సీఎం కేసీఆర్ రాకతో గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Read latest TelanganaNews and Telugu News | Follow us on FaceBookTwitter

Tags: cm kcr native village chintamadaka siddipeta

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top