logo

సినిమాకు తీసుకెళ్తామ‌ని న‌మ్మించి..


22-Jul-2019 11:16IST
man raped 11 years old girl

హైదరాబాద్: సినిమా చూపిస్తామంటూ ఇద్దరు బాలికలను నమ్మించి తీసుకెళ్ళి బాలికలపై ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ పరిధిలోని ఓ మురికివాడకు చెందిన పదకొండేళ్ల బాలిక ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ చదువుతోంది. కొన్ని నెలల క్రితం తండ్రి మరణించగా, తల్లి మతిస్థిమితం కోల్పోయి మద్యానికి బానిసైంది. పెద్దమ్మ ఇంటి వద్ద ఓ ఎనిమిదేళ్ల బాలికతో ఆడుకుంటోంది. పక్కనే నివసిస్తున్న ఇస్లావత్‌ దస్రు (23) ఇద్దరు బాలికలకు మాయమాటలు చెప్పి సరూర్‌నగర్‌-గడ్డిఅన్నారం మార్గంలోని ఓ సినిమా థియేటర్‌లో సినిమా చూపిస్తామంటూ నమ్మించాడు. చెత్త వ్యాపారం చేసే కేతావత్‌ మోతీలాల్‌ (30) సహకారం తీసుకుని ద్విచక్ర వాహనంపై నలుగురు సినిమా థియేటర్‌కు సాయంత్రం 6:30 గంటలకు చేరుకున్నారు. ఇంకా సినిమా ప్రారంభమయ్యేందుకు సమయం ఉందని చెప్పి ఎదురుగా ఉన్న నిర్మాణ పనులు ఆగిపోయిన భవనం సెల్లార్‌లోకి తీసుకెళ్లారు. దస్రు తొలుత బాలిక (11)పై అత్యాచారం చేశాడు. తర్వాత మోతీలాల్‌ సిద్ధమయ్యాడు. భయపడిన మరో బాలిక(8) గట్టిగా కేకలు వేయడంతో.. ఆ మార్గంలో వెళ్తున్న కొందరు వారిని కాపాడి యువకులను పోలీసులకు అప్పగించారు. 

Tags: 11 years girl rape arrested hyderabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top