logo

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాపర్‌ వైర్ల దొంగలు అరెస్ట్


22-Jul-2019 12:09IST
electric transformer copper wire robbers arrested

విద్యుత్ ట్రాన్స్ వైర్ల నుండి కాపర్ వైర్లు దొంగలిస్తున్న దుండగులను సీసీటీవీ ఫోటేజి ద్వారా గుర్తించి పట్టుకున్నట్లు కామారెడ్డి ఎస్ఐ సాజిత్ తెలిపారు. నిందితుల వద్దనుండి కాపర్ వైర్లను స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ సాజిత్ వివరాలు వెల్లడించారు. మద్నూర్ మండలం సలాబత్ పూర్ చెక్ పోస్ట్ వద్ద ముగ్గురు వ్యక్తులు ఒకే బైక్ పై వెళ్తుండగా అనుమానించిన పోలీసులు స్టేషన్ కు తరలించి విచారించినట్లు తెలిపారు. విచారణలో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 37 దొంగతనాలు జరిగాయని, సుమారు 56 ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ వైర్లను దొంగలించినట్టు చెప్పారు.

Tags: electric transformer copper wire robbers arrested

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top