logo

గుడిలో ఓ ప్రేమికుడి ఆత్మహత్య..


22-Jul-2019 12:47IST
lover committing suicide

తన ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయికి వేరోకరితో పెళ్లి నిశ్చయం కావడంతో ఆ యువకుడు తట్టుకోలేక పోయాడు అంతే కాకుండా ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. చివరిదాకా తన తోనే నడవాలనుకున్న తన కోరిక చివరకు ఒంటరివాణ్ణి చేయడంతో చివరికి ఓ దేవాలయంలో ఉరివేసుకుని తన తనువు చాలించాడు. వివరాల్లోకి వెళితే...ఆగ్రా జిల్లాకు చెందిన శ్యామ్ సికర్‌వార్(22) ఒక అమ్మాయిని ప్రేమించాడు. వారిద్దరి పెళ్ళికి పెద్దలు నిరాకరించడమే కాకుండా ఆమెకు వేరే వాడితో ఎంగేజ్‌మెంట్ చేశారు. విషయం తెలిసిన శ్యామ్ సికర్‌వార్ తట్టుకోలేకపోయాడు. 

ఆమె లేని జీవితం వద్దనుకున్నారు అదే ఆవేశంలో ఓ దేవాలయంలోకి వెళ్లి చనిపోవాలనుకున్నాడు. దాంతో ఆత్మహత్య చేసుకుంటున్న దృశ్యాలను అతను ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్ చేయడం గమనార్హం. ఆత్మహత్య సమయంలో చేసిన ఫేస్‌బుక్‌ లైవ్ వీడియోలో.. తన బలవన్మరణానికి ఎవరూ కారణం కాదని సికర్‌వార్ పేర్కొన్నాడు. అంతేకాదు, అతను చనిపోయాక.. తన డెడ్ బాడీ ఫోటోలను కూడా ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయాలని కోరాడు. 

చనిపోయాక తన అవయవాలను దానం చేయాలని సూసైడ్ నోట్‌లో రాశాడు. చనిపోతున్నందుకు తన కుటుంబ సభ్యులకు క్షమాపణలు తెలిపాడు. తరువాత తాడుతో ఉరివేసుకొని చనిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్ధలానికి చేరుకొని దర్యాప్తు చెయ్యగా... తన గర్ల్‌ఫ్రెండ్ వేరే పెళ్లి చేసుకుంటోందని సికర్‌ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని.. ఆఖరికి జాబ్ కూడా కోల్పోయాడని తేలింది. అంతే కాకుండా చివరగా తను ఫేస్ బుక్ లో మాట్లాడిన మాటలవివే  

"ఆమె నేను మిస్సయ్యాను. ఆమె లేకుండా బతకలేను. ఆమె వేరొకరిని పెళ్లి చేసుకోబోతుందన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఆఖరికి నా జాబ్ కూడా కోల్పోయాను." అంటూ సికర్ తన ఆత్మహత్య వీడియో పోస్ట్ చేసిన తర్వాత.. అతని ఫేస్‌బుక్ ఎకౌంట్ డీయాక్టివేట్ అయినట్టు సమాచారం.

Tags: love failure lovers suicide attempt Agra

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top