logo

కలకలం రేపుతున్న ఏనుగుల మృతి


22-Jul-2019 14:12IST
elephants killed in disturbance

 చిత్తూరు జిల్లాలోని పలమనే రు సమీపంలోని అభయారణ్యంలో నిన్న ఓ పిల్ల ఏనుగు మరణించింది. నిన్న ఆహారం కోసం వెతుకుతూ ఈ ఏనుగు మృత్యువాత పడినట్టు అధికారులు తెలిపారు. అంతే కాకుండా కొన్ని రోజుల క్రితం ఇదే అరణ్యంలో మగ ఏనుగు లైంగి క దాడిలో ఓ ఆడ ఏనుగు చనిపోయింది. దాంతో కొద్దీ రోజుల నుండి వరుస ఏనుగుల మరణాలు అక్కడి ప్రాంతంలో కలకలం రేపింది.  కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సంఖ్య 42 నుంచి 36కు తగ్గింది. తమిళనాడు, కర్ణాట క, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలు తమ సరిహద్దు ల్లో కందకాలు తవ్వాయి. ‘పిల్ల ఏనుగులు అడవిలో ఎక్కువగా సంచరించాలనుకుంటాయి. కందకాలు, విద్యుత్‌ తీగలు, పారిశ్రామికీకరణ, ఆహారం కొరతతో అవి మర ణిస్తున్నాయి’ అని ఓ అటవీ శాఖ అధికారి తెలిపారు. ఆహారం కోసం ఏనుగులు గ్రామాలకొచ్చి మరణించకుండా రూ. 2 లక్షల ఖరీదు చేసే ఈ కాలర్‌ను ఏనుగుల సమూహానికి నాయకత్వం వహించే ఏనుగుకు పెడితే వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు గుర్తించి, దారి మళ్లించొచ్చు. కానీ మా వద్ద సరిపడా రేడియో కాలర్స్‌ లేవు’ అని పేర్కొన్నారు.

Tags: chittoor elephants ap

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top