logo

హాంకాంగ్‌లో చెలరేగిన నిరసన జ్వాలలు..


22-Jul-2019 17:02IST
protest flames in Hong Kong

నిన్న హాంకాంగ్‌లో మళ్లీ నిరసన జ్వాలలు చెలరేగాయి. ప్రజాస్వామ్య సంస్కరణలు, సార్వత్రికఓటుహక్కు కల్పించాలని కోరుతూ వేలాది మంది ప్రజలు వీధుల్లో భారీ ప్రదర్శన చేపట్టారు. నేరస్తుల అప్పగింత చట్టానికి(ఎక్స్‌ట్రడిషన్‌ లా) వ్యతిరేకంగా ఆందోళనకారులు తమ ఉద్యమాన్ని ఏడో వారాంతం కూడా కొనసాగించారు. దాంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీలు తీశారు. ర్యాలీ చివర్లో ముసుగును ధరించిన కొందరు ఆందోళనకారులు హాంకాంగ్‌లోని చైనా కార్యాలయంపై రాళ్లతో దాడికి దిగారు.

తమ చట్ట విధానాలు, హక్కులను చైనా కాలరాస్తున్నదని నినదించారు. నేరాలకు పాల్పడిన వారిని విచారణ నిమిత్తం చైనాకు అప్పగించే చట్టంపై గత రెండు నెలలుగా హాంకాంగ్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో హాంకాంగ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌.. వివాదాస్పద బిల్లును తాత్కాలికంగా నిలుపుదల చేసింది. పూర్తిగా ఉపసంహరించకపోవడంపై నిరసనకారులు తమ ఆందోళనలను ఉధృతం చేశారు.

Tags: china Protest flames Hong Kong

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top