logo

కల్తీ పెట్రోల్ వాహనదారులు ఆందోళన ...!


23-Jul-2019 09:31IST
hindustan petroleum pump mixing water in petrol

హైదరాబాద్ చైతన్యపురి చౌరస్తాలోని హెచ్ పి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ లో నీళ్లు కలిపి పోస్తున్నారంటూ వాహనదారులు బంక్ వద్ద ఆందోళనకు దిగారు. వాహనాలలో పెట్రోల్ కొట్టించి కొద్దీ దూరం వెళ్ళిన తరువాత వాహనాలు ఆగిపోవడంతో వెంటనే పెట్రోల్ పై అనుమానం వచ్చిన వాహన దారులు, ఖాళీ బాటిల్స్ లో పెట్రోల్ నింపి చూడగా అందులో నీరు రావడంతో వాహనదారులు అవాక్కయ్యారు. దాదాపు 20మంది వాహనదారులు బంకు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. దీనిపై యాజమాన్యాన్ని నిలదీయగా, కంపెనీ పంపించిన విధంగానే పెట్రోల్ అమ్ముతున్నామని, కల్తీ పై మాకు ఎలాంటి సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. 

లక్షలు పెట్టి వాహనాలు కొని, తెలియక ఇలాంటి పంపుల్లో కల్తీ పెట్రోల్ పోసుకోవడం వల్ల  కొన్ని రోజులకే మెకానిక్ లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం చైతన్యపురి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే, ఇదే బంక్ లో గతంలో కూడా పెట్రోల్ లో నీళ్లు వచ్చాయి, ఇప్పుడూ అదే తీరుగా నీళ్లు రావడం పలు అనుమానాలకు తావిస్తుంది. నగరంలోని పలు పెట్రోల్ పంపుల్లో ఇలాంటి ఘటనలు  చోటుచేసుకుంటున్న సంబంధిత అధికారులు బంక్ ల పై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. దీని పై సదరు వాహనదారులు తూనికలు కొలతల శాఖ అధికారులకు సమాచారమివ్వగా, వారు స్పందించక పోవడం గమనార్హం.

Tags: hindustan petroleum chaitanya puri

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top