logo

అనుమానాస్పద స్థితిలో చికిత్స పొందుతూ మహిళ మృతి


23-Jul-2019 11:01IST
woman killed while receiving treatment in suspicious condition

కర్నూల్: సుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన నిన్నరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...డ్డేపల్లి పురపాలిక కేంద్రమైన శాంతినగర్‌కు చెందిన శేఖర్‌కు రాజోలి మండలం చిన్నధన్వాడకు చెందిన పరిమళతో 3 ఏళ్ల కిందట వివాహమైంది. వీరి మూడేళ్ళ కాపురానికి ప్రతీకగా వారికి కుమారుడు పుట్టాడు. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న ఆమె జీవితంలో ఒకేసారి అదనపు కట్నం తేవాలని, అందంగా లేవనే విషయాలపై భర్త శేఖర్ వేధింపులు మొదలయ్యాయని బంధువులు తెలిపారు. 

15 రోజుల కిందట ఇంట్లో అస్వస్థకు గురైన పరిమళను కర్నూల్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షలలో కూల్‌డ్రింక్‌తో పాటు పురుగుమందు అవశేషాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స పొందుతూ  రాత్రి పరిమళ మృతి చెందడంతో శేఖర్‌ కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలిపి తాగించినట్లు పరిమళ తండ్రి చిన్నవెంటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు. కర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తహశీల్దార్‌ వెంకటరమణ, సీఐ సమక్షంలో పరిమళ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు.

Tags: woman killed suspicious karnool

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top