logo

భర్త ప్రశ్నించాడని వాటర్ హీటర్‌తో వాతలు పెట్టిన భార్య..!


23-Jul-2019 16:15IST
husband quizzes wife with water heater

వేరే వ్యక్తితో ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నించిన ఓ భర్తకు భార్య ఊహించని షాక్ ఇచ్చింది. తననే ప్రశ్నిస్తావా? అని ఊగిపోయిన ఆమె భర్తకు చుక్కలు చూపించిన వింత సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. అంచెట్టి తాలూకా పంజల్‌తురైకి చెందిన చిన్నరాజ్‌ (37)కు ఏడేళ్ల క్రితం జ్యోతితో పెళ్లైంది. వీరికి ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న అతడు హొసూరు సమీపంలోని బేళగొండపల్లిలో నివాసముంటున్నాడు. నిన్న రాత్రి పని ముగించికొని చిన్నరాజు ఇంటికొచ్చేసరికి భార్య మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించింది. ఈ విషయాన్ని చిన్నరాజు నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో మనస్తాపానికీ గురైన ఆమె  తెల్లవారు జామున జ్యోతి, మరో ముగ్గురు వ్యక్తులను పిలిపించింది. వారి సహాయంతో అతడ్ని బంధించి, వాటర్‌ హీటర్‌ను వేడిచేసి భర్తకు వాతలు పెట్టింది. బాధితుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకునే సరికి వారితో సహా పరారైంది. బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
 

Tags: husband quizzes wife water heater karnataka

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top