logo

అపహరణకు గురైన బాలుడు.. ఎంతకీ చిక్కని ఆచూకీ..!


23-Jul-2019 16:36IST
a boy kidnapped by someonestill not find him

తూర్పు గోదావరి జిల్లా మండపేట సమీపంలోని విజయలక్ష్మీ నగర్‌లో అపహరణకు గురైన నాలుగేళ్ల బాలుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. నిన్న రాత్రి సాయిధరణి అపార్ట్‌మెంట్‌ వద్ద జరిగిన  అపహరణ ఘటన తీవ్ర కలకలం రేపింది. అపార్ట్‌మెంట్‌లో అమ్మమ్మతో పాటు వెళ్తున్న జశిత్‌ అనే ఐదేళ్ల బాలుడిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అపహరించారు. కుమారుడి అపహరణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ కోసం ఏడు బృందాలు గాలిస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి వెల్లడించారు. ఇప్పటివరకు నిందితుల నుంచి ఎలాంటి ఫోన్‌ రాలేదని చెప్పారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన సమయంలో నిందితులు బాలుడిని అపహరించినట్టు ఆయన తెలిపారు. ఈ ఘటనకు వారం రోజుల ముందు నుంచి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. బాలుడి తల్లిదండ్రులకు ఎవరైనా శ్రతువులు ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: a boy kidnapped still not find east godavari

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top