logo

పెట్రోల్ బంకులో ఘరాణ మోసం


24-Jul-2019 14:20IST
fraud in petrol bunk

హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ఉన్న హెచ్‌పి పెట్రోల్ బంక్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. పెట్రోల్ బంక్ యాజమాన్యం పెట్రోల్‌లో నీళ్లు కలిపి కల్తీ చేసి అమ్ముతుందని వాహనదారులు ఆందోళనకు దిగారు. వాహనదారులు తీసుకొచ్చిన బాటిళ్లలో నీరు, పెట్రోల్ కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. వాహనదారులు బాటిళ్లతో బంక్ ముందు ఆందోళనకు దిగడంతో బంక్ యాజమాన్యం అక్కడ నుంచి పరారైంది. ఇదే బంక్‌లో గతంలో కూడా ఇదే తరహా మోసం జరిగిందని.

అప్పుడు కూడా యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే ఎవరూ స్పందించ లేదని బాధితులు ఆవేదక వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్‌కు బదులు నీళ్లు వస్తుండటంతో వేలు ఖర్చు పెట్టి కొనుక్కున్న వాహనాలు పాడవుతున్నాయని వారు మండిపడుతున్నారు. సమాచారమందుకున్న పోలీసులు బంక్ వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బంక్ యజమానులపై చర్యలు తీసుకోవాలని బాధితులు చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags: fraud petrol bunk hyderabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top