logo

బాలుడు జషిత్‌ క్షేమం ..!


25-Jul-2019 08:29IST
boy jishith was safe by kidnappers

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన బాలుడు జషిత్‌ కిడ్నాపర్ల బారి నుంచి క్షేమంగా బయటపడ్డాడు. కుతుకులూరు రోడ్డులో జషిత్‌ను కిడ్నాపర్లు వదిలి వెళ్లారు. బాలుడిని గమనించిన కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం రాత్రి ఇంటి వద్దే జషిత్‌ను దుండగులు కిడ్నాప్‌ చేశారు. నాయనమ్మ పార్వతిపై దాడి చేసి బాలుడిని ఎత్తుకెళ్లారు. 

పోలీసులకు జషిత్‌ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో బాలుడి కోసం పదిహేడు పోలీసుల బృందాలు రాత్రింబవళ్లూ జల్లెడ పట్టాయి. వేలాది మంది నెట్‌జన్లు సోషల్‌ మీడియాలో బాబు ఫొటో షేర్‌ చేస్తూ తమ వంతుగా సహకరించారు. జషిత్‌ క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. జషిత్‌ క్షేమంగా ఉండడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

Tags: boy jishith safe kidnappers rajamundry ap

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top