logo

నిద్రమాత్రలు మింగి ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం


25-Jul-2019 12:55IST
An old woman attempts suicide by swallowing sleeping pills

గుంటూరు: స్థానిక జిల్లాలోని తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం చేయడం అక్కడి స్థానికులలో కలకలం సృష్టించింది. గన్నవరానికి చెందిన సత్యనాగకుమారి అనే అనే వృద్ధురాలు క్యాంపు కార్యాలయానికి వచ్చింది. అందరూ చూస్తుండగానే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం  చేసింది. దాంతో స్పందించిన అక్కడి భద్రతా సిబ్బంది హుటాహుటిన ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈనెల 19వ తేదీన తన సమస్యలపై నాగసుందరి ‘స్పందన’ కార్యక్రమంలో అర్జీ ఇచ్చింది. అధికారుల నుంచి సకాలంలో స్పందన రాకపోవడంతో ఆమె ఈ ప్రయత్నం చేసినట్లు సమాచారం. వైద్యులు చికిత్స చేస్తున్నఆమె స్పందించకపోవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు నిర్థారించారు.    

Tags: attempts suicide cm jagan office thadepally

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top