logo

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి


25-Jul-2019 18:12IST
man died because of current shock in sanga reddy

సోదరి ఇంట్లో జరిగే చిగురు పండుగ విందుకు వెళ్లేందుకు గుర్రం పై బయలుదేరిన వ్యక్తి గ్రామ శివారులో విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా లో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరా గ్రామ శివారులో  మెజార్టీ గిరిజన తాండలలో ప్రతి ఏటా వర్ష కాలం ఆరంభం కాకగానే జులై మాసం లో చిగురు పండుగ పేరిట మాంసాహార విందును ఏర్పాటు చేస్తారు. 

ఇందులో భాగంగానే భీంరా పార్థు తండా కి చెందినా రాథోడ్ వెంకట్(45)రాత్రి మండల పరిధి లోని చింతామణి తండాలో తన సోదరి ఇంట్లో జరిగే చిగురు పండుగ విందు కోసం గుర్రం పై బయలు దేరాడు. ఈ  క్రమంలో భీంరా శివర్లోకి చేరుకోగానే గుర్రపు కాళ్ల చప్పుడు విని పంటలకు రక్షణ గా అడవి పందుల కోసం కాపలాగా ఉన్నా కుక్కలు ఒక్కసారిగా అరుపులు వేసాయి. 

దీనితో ఒక్కసారిగా బెదిరి పోయిన గుర్రం వెనెక్కి మరలి పొలం లోకి పరుగులు పెట్టింది, దీనితో అక్కడే కిందకి వేలాడుతున్న లుపేజ్ వైర్లు గుర్రం మెడకు తగలడంతో విద్యుత్ షాక్ తగిలి గుర్రం తో పాటు దాని పై వెళ్తున్నా వెంకట్ సైతం  అక్కడికక్కడే మృతి చెందారు. పొలం యజమాని రాత్రి 10 గంటలకు   పంటల కాపలా కోసం వెళ్లగా విద్యుత్ షాక్ తో గుర్రం తో పాటు వెంకట్ మృతి చెంది ఉండడాని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా చేసి భార్య వాలా బాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు.  శవాన్ని పోస్టుమార్టం కోసం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Tags: man died power sanga reddy

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top