logo

తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన యువరాజ్


26-Jul-2019 12:01IST
yuvraj disappointed in the first match

కెనడా : అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా హీరో యువరాజ్‌ సింగ్‌ ప్రతుతం 'గ్లోబల్‌ టీ20 కెనడా' లీగ్‌లో ఆడతున్నాడు. ఈ టీ20 లీగ్‌ రెండవ సీజన్ కెనడాలోని బ్రాంప్టన్‌లో గురువారం ప్రారంభం అయింది. ఇది ఆగస్టు 11 వరకు లీగ్ జరుగుతుంది. అయితే టొరంటో నేషనల్స్‌ జట్టు తరపున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు బరిలోకి దిగిన ఇండియన్ క్రికెటర్ యువీ 27 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసి స్టంపౌట్‌గా అయ్యాడు. దీంతో రిటైరైన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లో యువరాజ్ అభిమానుల్నినిరాశపరిచాడు. యువరాజ్ కెప్టెన్‌గా వ్యవహిస్తున్న టోరంటో జట్టులో బ్రెండెన్ మెక్‌కల్లమ్ (4), కీరన్ పొలార్డ్ (30) పరుగులు చేశారు. మెక్‌కల్లమ్, యువరాజ్ విఫలమయినా.. క్లాసేన్ (41), పొలార్డ్ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 159 పరుగులు చేసింది.

Read latest Sports News and Telugu News |Follow us on FaceBookTwitter

Tags: Cricket Canada VancouverKnights TorontoNationals T20Cricket

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top