logo

సోని కిడ్నాప్ కేసులో మ‌రో మ‌లుపు


26-Jul-2019 12:09IST
soni kidnap case

  • ఐదు బృందాలుగా ఏర్ప‌డి గాలంపు
హైద‌రాబాద్‌: ఉద్యోగం ఇస్తామంటూ మాయ‌మాట‌లు చెప్పి ఓ సోని అనే యువ‌తిని ఆగంత‌కులు కిడ్నాప్ చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ కేసులో పోలీసులు పురోగ‌తి ల‌భించింది. నిందితుడు కృష్ణా జిల్లా కంకిపాడు మండ‌లం దావులూరుకు చెందిన ర‌వి శంక‌ర్‌గా గుర్తించారు. నిందితుడు ఉద్యోగం ఇప్పిస్తానని ఈ నెల 23న యువతిని కారులో తీసుకెళ్లాడు. యువతితో పాటు ఆమె తండ్రి, సోదరుడిని కూడా తీసుకెళ్లాడు. కాగా మార్గమధ్యలో మాయమాటలు చెప్పి యువతి తండ్రి, సోదరుడిని మధ్యలోనే దించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కిడ్నాప్‌కు ఉప‌యోగించిన కారు కూడా చోరీ చేసి తీసుకువచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. బళ్లారిలో నెల రోజుల క్రితం కారును చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడిపై కంకిపాడు, తల్లాడ, విజయవాడ, బళ్లారిలో కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పటికే పలువురిని మాయమాటలు చెప్పి మోసగించినట్లు గుర్తించారు. యువతి ఆచూకీపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Tags: soni kidnap case hyderabad police

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top