logo

కొడుకు తప్పుచేశాడని తల్లిపై ప్రతీకారం...


26-Jul-2019 18:08IST
revenge on mother for son wrongdoing

జైపూర్: కొడుకు తప్పు చేశాడని ఆరోపించిన కొందరు అతడి తల్లిపై ప్రతీకారం తీర్చుకున్న సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం.. ఉప్లీ ఓడన్ గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రమానికి చెందిన యువతితో కలసి పారిపోయాడు. దీంతో ప్రతీకారేచ్ఛేత రగిలిపోయిన కుటుంబ సభ్యులు..యువకుడి తల్లిపై రెచ్చిపోయారు. దాంతో ఉదయం కొంత మంది వ్యక్తులు సదరు మహిళ ఇంటికి చేరుకున్నారు. ఆమెను జుట్టు పట్టి ఇంటిలోంచి బయటకు ఈడ్చుకొచ్చారు. నీ కొడుకేడంటూ ప్రశ్నిస్తూ, ఇనుపరాడ్డుతో కొడుతూ రొడ్డు మీదకు తీసుకెళ్లారు. అనంతరం ఆమె దుస్తులూ లాగేసి...అందరూ చూస్తుండానే నగ్నంగా ఊరంగా తిప్పారు. ఈ ఘటనలో సదరు మహిళకు మోకాళ్ల మీద, వీపు మీద తీవ్రగాయాలయ్యాయి. కాగా నిందితులు ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి  చేరుకున్న పోలీసులు సదరు మహిళను రక్షించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Tags: revenge on mother son wrongdoing .

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top