logo

చంద్రబాబు జడ్ ప్లస్ క్యాటగిరి తగ్గించొద్దు : కేంద్రం


27-Jul-2019 08:53IST
chandrababu z plus category was will continue

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు వైసీపీ ప్రభుత్వం ఎన్‌ఎస్‌జీ భద్రత తొలగించింది. ఈ విషయం ఇప్పటికే ఆయన తన భద్రత విషయంలో కోర్డుకు వెళ్లిన సంగతి ప్రజలకు తెలిసిందే.. కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ భద్రత కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇప్పటికే చంద్రబాబుకు  మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నందున జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. 

ఇటీవల దేశంలోని ప్రముఖుల భద్రతపై హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో మావోయిస్టులు, ఉగ్రవాదులతో పాటు ప్రత్యర్థుల నుంచి చంద్రబాబుకు ముప్పు పొంచి వుందని రాష్ట్ర, జాతీయ నిఘా సంస్థలు ఇచ్చిన నివేదిక మేరకు ఎన్ఎస్‌జీ భద్రతను కొనసాగించాలని హోంశాఖ వెల్లడించింది.  చంద్రబాబుకు జడ్‌ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగిస్తున్న మోదీ సర్కార్ మరోవైపు సమాజ్‌ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్,  రాజీవ్ ప్రతాప్ రూడీ, మీరా కుమార్ తదితరులకు భద్రతను తగ్గిస్తున్నట్లు ఓ ప్కటనలో వెల్లడించింది. 

Tags: chandrababu z plus category tdp

Advertisement
Advertisement
Top