logo

మెట్రోకు తప్పిన పెను ప్రమాదం


27-Jul-2019 16:32IST
a missed accident for the metro

హైదరాబాద్: పట్టణంలోని మెట్రో రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. లక్డీకపూల్‌లో రెండు మెట్రో రైళ్లు ఎదురెదురగా ఒకే ట్రాక్‌పైకి రావడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళ్తే.. మియాపూర్‌-ఎల్బీనగర్‌ మార్గంలో వెళ్లవలసిన మెట్రో రైలు పొరపాటున మరో ట్రాక్‌లోకి వెళ్లిపోయింది. దీంతో వెంటనే సమాచారం అందుకుని అప్రమత్తం అయిన  డ్రైవర్ లక్డీకపూల్‌ స్టేషన్‌లో రైలును నిలిపివేసి, ప్రయాణికులను అక్కడ దించి రైలు వెనక్కి తీసుకుని వెళ్లారు. ఈ ఘటనతో మెట్రో రైలు సేవలను అధికారులు అరగంట పాటు నిలిపివేయగా తర్వాత అంతా సర్ధుకుంది.అయితే ఇదే సమయంలో ఎదురుగా ఎటువంటి రైలు రాకపోవడంతో రైలులోని మొత్తం 400మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సాంకేతిక కారణాలతో హైదరాబాద్ మెట్రో రైలు కొన్ని నెలల కితం నిలిచిపోయింది. అయితే ఇలా రాంగ్ రూట్‌లో అంటే ట్రాక్ మారి ప్రయాణించడం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం. అసలు రైలు ట్రాక్ ఎలామారిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

Tags: miyapur-lbinagar hyderabad metro

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top