logo

60 రోజుల్లోనే మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చాం : బొత్సా


28-Jul-2019 11:55IST
Ap minister botsa satyanarayana comments on chandrababu

గతంలో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి 6 కూడా నెరవేరర్చలేదని వైసీపీ నేత బొత్సా సత్యనారాయణ అన్నారు. ఈ నేపథ్యంలోనే బొత్స నిన్న మీడియాతో మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలను అన్నీంటిని నేరవేర్చామని అన్నారు. యువతకు ఉపాది హామీ కల్పించామని అన్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ చారిత్రాత్మక నిర్ణయాలని బొత్స అన్నారు. 

ఇచ్చిన మాట ప్రకారం యువతకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. 4లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కో సచివాలయానికి 10 మందిని నియమిస్తామని చెప్పారు. మంచి పనులకు మద్దతు ఇవ్వకుండా చంద్రబాబు సభ నుంచి పారిపోయారని బొత్స ఆరోపించారు.

Tags: Ap minister botsa satyanarayana chandrababu naidu tdp ysrcp

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top